HYD: బంజారాహిల్స్లో మంత్రి సీతక్క “సఖి నివాస్” వర్కింగ్ ఉమెన్ హాస్టల్, “సఖి కేంద్రం”ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చే మహిళలకు భద్రతతో కూడిన వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.