NLR: తోటపల్లి గూడూరు మండలం వరకవి పూడి -3 ఎస్టీ కాలనీలో మంగళవారం కిశోరీ వికాసం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రంగమ్మ మాట్లాడుతూ… బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. బాలికలు 18 సంవత్సరాల దాటిన తర్వాతే వివాహం చేసుకోవాలన్నారు. బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.