AP: రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పలువురు సినీ నిర్మాతలు కలిశారు. పవన్‌ను కలిసినవారిలో నిర్మాతలు రవి, సతీష్, నాగవంశీ, సాహు గారపాటి ఉన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లకూ పర్సంటేజీ ఇవ్వాలని పవన్‌ను నిర్మాతలు కోరారు.