KMR: రైలు ఢీకొని గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆరెల్లి లక్ష్మి తన గొర్రెల మందను తీసుకుని ప్రతిరోజు మాదిరిగానే గ్రామ శివారులో మేపడానికి వెళ్లింది. KMR నుంచి NZB వైపు వెళ్తున్న రైలు డ్రైవర్ గొర్రెలను చూసి హారన్ కొట్టాడు. దీంతో బెదిరిన సుమారు 19 గొర్రెలు రైలు కింద పడి మృతి చెందాయి.