TPT: నాగలాపురం సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం గురుసంచార పూజలు వైభవంగా నిర్వహించారు. ప్రదోష మండపంలో వృషభ వాహనంపై దక్షిణామూర్తి స్వామి ప్రతిమను అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. నవగ్రహాలకు మహాభిషేకాలు, పరిహార అర్చనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.