తమిళనాడు సీఎం విజయ్ దళపతిని దర్శకుడు లోకేష్ కనగరాజ్ మర్యాదపూర్వకంగా కలిశాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి అభినందనలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను లోకేష్ షేర్ చేస్తూ.. ‘తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ అన్న నీకు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. ఇక వీరి కాంబోలో ‘మాస్టర్’, ‘లియో’ వంటి హిట్ మూవీలు వచ్చిన విషయం తెలిసిందే.