MLG: వెంకటాపూర్ మండలం ఇంచెంచెర్వుపల్లి చెరువులో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలు తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇవాళ పనివేళల్లో మార్పుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నాలుగు గంటల ఆన్లైన్ అటెండెన్స్‌ను 3గంటల పనిగా పరిగణించి, గంట ముందుగానే పనులు ముగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.