MLG: ఈనెల 28న ఎన్టీఆర్ జయంతిని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని టీడీపీ ములుగు జిల్లా నాయకుడు దేవా నాయక్ మంగళవారం పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ స్థాపించిన కొద్ది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహానేత ఎన్టీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి అనేక నాయకులను తీర్చిదిద్దారని కొనియాడారు.ఆయనకు ఘన నివాళులు అర్పించాలన్నారు.