VZM: వి.టి.అగ్రహారంలోని ప్రభుత్వం ఐటీఐ కళాశాలలో ఇవాళ నిర్వహించిన “క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్-2026”లో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం ఎంపికైన వారికి ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేశారు.