SS: హిందూపురం 11వ వార్డు మోడల్ కాలనీలో మంగళవారం నిర్వహించిన స్వచ్ఛ హిందూపూర్ కార్యక్రమంలో హిందూపురం బీజేపీ పట్టణ అధ్యక్షురాలు అంజలి రమేష్ రెడ్డి, రవితేజ రెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛతతోనే ఆరోగ్యం, అభివృద్ధి సాధ్యమవుతాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని సూచించారు.