ప్రకాశం: బక్రీద్ పండుగను పురస్కరించుకొని అక్రమంగా మూగజీవాలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలను హెచ్చరించారు. మంగళవారం మీడియాకు ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు. మూగజీవాలను తరలించి వాటిని సంహరించడం చట్టరీత్యా నేరమని ముఖ్యంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.