AP: యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా మహానాడును నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత చెప్పారు. రేపు, ఎల్లుండి నిర్వహించే మహానాడును విజయవంతం చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నవశకానికి నాంది పలికే తొలి మెట్టుగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. స్త్రీశక్తి నినాదంతో ఈసారి మహానాడు ముందుకెళ్తుందని వెల్లడించారు. ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు.