»A Butchers Son Who Left His Younger Mother In The Dumping Yard
Oldage Home : కన్న తల్లిని డంపింగ్ యార్డ్ లో వదిలేసిన కసాయి కొడుకు
ఏపీ తాడేపల్లి లో అమానుష ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిని కసాయి కొడుకు (Son) డంపింగ్ యార్డ్ (Dumping yard ) లో వదిలేసి వెళ్లాడు. మానవత్వం మంట కలిసింది. నవమాసాలు కని పెంచిన కన్నతల్లే భారమైంది. కనికరం లేని కన్న కొడుకు ఏకంగా తల్లిని డంపింగ్ యార్డ్‌లో వదిలి వెళ్లాపోయిడు.
ఏపీ తాడేపల్లి లో అమానుష ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిని కసాయి కొడుకు (Son) డంపింగ్ యార్డ్ (Dumping yard ) లో వదిలేసి వెళ్లాడు. మానవత్వం మంట కలిసింది. నవమాసాలు కని పెంచిన కన్నతల్లే భారమైంది. కనికరం లేని కన్న కొడుకు ఏకంగా తల్లిని డంపింగ్ యార్డ్‌లో వదిలి వెళ్లాపోయిడు. కన్న ప్రేగే బరువుగా మారటాన్ని జీర్ణించుకోలేని తల్లి(Mother) చనిపోవాలనుకుంది. అయితే చివరి క్షణంలో కొడుకు గుర్తొచ్చి బలవన్మరణ ప్రయత్నాన్ని విరమించుకుంది. డంపింగ్ యార్డులో ఉన్న ఆ వృద్దురాలని గమనించిన స్థానికులు రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వీఆర్వో స్పందించి ఆ వృద్దురాలిని ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించారు. రెండు రోజుల నుండి తాడేపల్లి (Tadepalli) బ్రహ్మానందపురంలోని డంపింగ్ యార్డులో రెండు రోజుల నుండి ఒక వృద్దురాలు కూర్చుని ఉంది. కన్న కొడుకు ఇక్కడ వదిలి వేయడంతో చనిపొదామని అనుకున్నా దైర్యం చాలలేదని కన్నతల్లి రామ లక్ష్మి (Rama Lakshmi) కన్నీటి పర్యంతం అయింది. ఈ విషయాన్ని స్థానికులు రెవిన్యూ అధికారులకు చెప్పడంతో వీఆర్వో (Vro) గోలి ఇన్నయ్య డంపింగ్ యార్డు వద్దకు వచ్చి ఆ మహిళ వివరాలు సేకరించారు.
తన పేరు రామలక్ష్మీ అని తన భర్త పేరు కృష్ణ అని చెప్పిన వృద్దురాలు తనది విజయవాడలోని గవర్నర్ పేట (Governor Peta) అని చెప్పింది. రెండు రోజుల క్రితం ఆటోలో తనను ఇక్కడకు తీసుకొచ్చి వదిలి వెళ్లిపోయినట్లు తెలిపింది. కొడుకు శ్రీనివాసే తనని వదిలిపెట్టి వెళ్లినట్లు చెబుతుంది. దీంతో ఆమెను రెవిన్యూ అధికారులు ఓల్డేజ్ హోమ్ (Oldage Home) కు తరలించారు. ఆమె పూర్తి వివరాలు సేకరించి ఇంటి అడ్రస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కన్న తల్లిని వదిలించుకునేందుకు కొడుకే ఆమెను డంపింగ్ యార్డులో వదిలిపెట్టినట్లు రెవిన్యూ (Revenue) సిబ్బంది భావిస్తున్నారు. వృద్దురాలి మానసిక స్థితి సరిగానే ఉన్నా కొడుకే డంపింగ్ యార్డులో వదిలి పెట్టి వెళ్లడంతో ఆవేదనకు గురై పూర్తి వివరాలు చెప్పటానికి నిరాకరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. బాధితురాలు రామలక్ష్మి ఆవేదనపై చలించిన అధికారులు బాధితురాలిని ఓ మిషనరీ(Missionary) సంస్థలో చేర్పించారు. సరిగా ఆహారం (Food) లేకపోవడంతో మరింత నిరసంగా ఉన్నట్లు సిబ్బంది చెప్పారు. కన్నతల్లే భారంగా మారిన ఘటన తాడేపల్లి పరిసరాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కన్నవారు బరువు కాదు బాధ్యత అంటూ పలువురు అనటం మరింత ఆవేదన పెంచింది. ప్రస్తుతం రెవిన్యూ సిబ్బంది ఆమెను సొంత వారి దగ్గరకు చేర్చే ప్రయత్నాల్లో ఉన్నారు.