ADB: శాంతిభద్రతల పరిరక్షణకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించినట్లు ఏఆర్ DSP కమతం ఇంద్ర వర్ధన్ తెలిపారు. మంగళవారం సోనాల మండలంలోని గుట్టపక్క తండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించి 120 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పెండింగ్లో ఉన్న 15 వాహనాల నుంచి చలాన్లను వసూలు చేసినట్లు తెలిపారు.