NRPT: బక్రీద్ పండుగ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం చేసే పోస్టులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు. పండుగ వేళ ప్రజలందరూ సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, సమాజంలో శాంతిభద్రతలను కాపాడాలని ఆయన జిల్లా వాసులకు సూచించారు.