KMM: రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా పేదలకు అన్యాయం జరగనివ్వనని, ప్రజలకు చట్టాలపై అవగాహన పెరిగితే నేరాలు తగ్గుతాయని సింగరేణి సీఐ ఎన్. సాగర్ ఇవాళ స్పష్టం చేశారు. ప్రజలకు పోలీస్ స్టేషన్ అంటే భయం కాకుండా నమ్మకం కలగాలని అన్నారు. మధ్య వర్తులు లేకుండా బాధితులు నేరుగా తనను కలవవచ్చని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.