AP: విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్ తెస్తున్నామని, వాతావరణ మార్పుల వల్ల పలుచోట్ల విద్యుత్ అంతరాయం వాస్తవమే అని మంత్రి గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. అక్కడక్కడా తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే పునరుద్ధరణకు కనీసం 2 నుంచి 4 గంటలు పడుతుందన్నారు. టోల్ ఫ్రీ ద్వారా సమాచారం అందిస్తామన్నారు.