ప్రకాశం: కొమరోలు మండలం కత్తులవానిపల్లిలో మంగళవారం తెల్లవారుజామున గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోగా, 8 వాహనాలకు జరిమానా విధించారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, దొంగతనాలు నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.