NLR: ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం నక్కల వాగులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై జనసేన పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల ఆధ్వర్యంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. 1,500 టిప్పర్ల మట్టి తవ్వకాలతో భారీ గుంతలు ఏర్పడి గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని.. కల్వర్టులు ధ్వంసమవుతున్నాయని ఆరోపించారు.