E.G: ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4 వార్డుల్లో కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులలో పారిశుధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించి, చెత్తను తొలగించే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. రహదారులపై ఉన్న డంపులను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.