ASF: ఆసిఫాబాద్ మండల కొమ్ముగూడ సమీపంలో కుడికాలు సత్తయ్య అనే రైతుకు చెందిన ఎద్దు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా కోసి మాంసాన్ని తరలించినట్లు స్థానికులు ఆరోపించారు. మాంసం కోసం చంపారా లేదా ఏదైనా అటవీ మృగం చంపిందా అనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.