BPT: రేపల్లెలో 40 మంది లబ్ధిదారులకు సుమారు రూ.47.34 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం టీడీపీ నేత అనగాని శివప్రసాద్ పంపిణీ చేశారు. పేద కుటుంబాల వైద్య ఖర్చులకు ఈ నిధి ఎంతో ఆసరాగా నిలుస్తుందని, బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సాయం పట్ల లబ్ధిదారులు ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.