శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నగరపాలక సంస్థ నీటి సరఫరా ఏఈ సత్యనారాయణ, ఆస్ఐ ఉమామహేశ్వరరావులను కమిషనర్ కూర్మరావు సోమవారం సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా వీరిరువురిని సస్పెండ్ చేసి పురపాలకశాఖకు సరెండర్ చేసినట్లు కూర్మారావు ఇవాళ తెలిపారు. ఈ అంశం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.