WG: తణుకు మీదుగా ప్రవహిస్తున్న గోస్తనీ కాలువ తీవ్ర కాలుష్యం బారిన పడటంపై డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల నుంచి కాలువలోకి వదులుతున్న మురుగు, రసాయన వ్యర్థాలను డ్రోన్లు, వీడియో కెమెరాల ద్వారా రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు.