వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 13 జూనియర్ కళాశాలలో అల్పాహారంతో పాటుగా మధ్యాహ్న భోజనాన్ని అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జూనియర్ కళాశాలలో సుమారు 4,691 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.