ELR: చింతలపూడి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. తిరుమలదేవిపేటలో అనగాని రాంబాబు, బొల్లం రామకృష్ణల నుంచి రసాయన పరీక్షల నిమిత్తం కల్లు నమూనాలను సేకరించారు. టి.నరసాపురం మండలంలోని పలు మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘సురక్ష’ యాప్ ద్వారానే మద్యం విక్రయాలు జరపాలని దుకాణదారులకు సూచించినట్లు ఎక్సైజ్ సీఐ పి.అశోక్ తెలిపారు.