ప్రకాశం: టంగుటూరు మండలంలోని వల్లూరమ్మ గుడి సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్ళింది. లారీ డ్రైవర్ నిద్ర మత్తుతో వాహనం నడపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఘటనలో ఎవరికి ప్రాణపాయం జరగలేదని పోలీసులు అన్నారు.