MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని మయూరి పార్కులో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం విధించినట్టు జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పార్కులోకి ప్లాస్టిక్ బాటిళ్లు ప్లాస్టిక్ ప్లేట్లు ఇతర సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులను అనుమతించడం జరగదు అన్నారు. పార్కులు సహజ వాతావరణాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.