AKP: మునగపాక మండలం తోటాడ నుంచి మునగపాక వరకు ఆవ కాలువలో పూడికతీత పనులు జరుగుతున్నట్లు ఇరిగేషన్ డీఈ సాయి ప్రశాంతి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. పూడికతీత పనులతో పాటు తుప్పలను కూడా తొలగిస్తున్నట్లు తెలిపారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పనులను చేపట్టామన్నారు.