KRNL: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సోమవారం క్వింటాకు గరిష్ఠంగా రూ.8,420, సగటుగా రూ.7,050 ధర లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పారదర్శక విధానాల వల్లే రైతులకు గిట్టుబాటు ధరలు అందుతున్నాయని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి తెలిపారు. గతంలో ఎదురైన ఇబ్బందులు ప్రస్తుతం తగ్గాయని పేర్కొన్నారు.