MNCL: ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగును మర్చిపోగా ఆ బ్యాగును పోలీసులకు అప్పగించి డ్రైవర్ గుంటి దామోదర్ నిజాయతీని చాటుకున్నారు. సోమవారం వేమన సుబ్బమ్మ మంచిర్యాలకు వస్తూ బ్యాగును బస్సులోనే మర్చిపోయి దిగి వెళ్లిపోయింది. ఆ బ్యాగులో మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 10 వేల నగదు ఉండటంతో డ్రైవర్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఎస్సైకి అప్పగించాడు.