ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన జన భాగీదారి అభియాన్ విజయవంతమైందని కలెక్టర్ హరిత తెలిపారు. 241 గ్రామాల్లో 341 గ్రామ సభలు, 241 అవగాహన ర్యాలీలు నిర్వహించారు. 168 ఆరోగ్య శిబిరాల్లో సికిల్ సెల్, టీబీ, డయాబెటిస్ పరీక్షలు చేశారు. 1080 మందికి జాబ్ కార్డులు, ఆధార్ సేవలు అందించారు. గిరిజన అభివృద్ధికి పథకాలు సమర్థంగా అమలవుతున్నాయని తెలిపారు.