WG: భీమవరంలో జిల్లా ఎస్సీ, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారుల సమక్షంలో ఏపీ నెట్ జీరోపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలోని ఆరుగొలను-1, ఎల్బీచర్ల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు మొదటి దశ నెట్ జీరో అమలుకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. పాఠశాలల్లో వర్షపు నీటి నిల్వ తదితర పర్యావరణ అనుకూల అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు.