AP: మాజీ సీఎం జగన్ చేసిన డీఎస్సీ లీక్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని జగన్ అవమానించారని, వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీని ఆపేందుకు 200 కేసులు వేశారని, గూగుల్, టీసీఎస్ రాకుండా అడ్డుకుంటూ యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్న జగన్ను ప్రజలు క్షమించరని మండిపడ్డారు.