ATP: తాడిపత్రి పట్టణంలో ఇవాళ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న గోపాల్ రెడ్డి అనే యువకుడిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పెన్నా నదిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు బెట్టింగ్ ముఠాపై దాడి చేయగా కొంతమంది పారిపోయారు. గోపాల్ రెడ్డి వద్ద నుంచి 7 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు.