AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ కోరుతూ రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో YCP MLC అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కీలక సాక్ష్యుల వాంగ్మూలం నమోదు చేసినందున తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే సాక్ష్యులను బెదిరించినందుకుగానూ అనంతబాబు బెయిల్‌ను ప్రత్యేక కోర్టు ఇప్పటికే రద్దు చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉంటూ ఆయన విచారణకు హాజరవుతున్నారు.