NLR: బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఏపీజీఈఏ బుచ్చిరెడ్డిపాలెం తాలూకా కార్యవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎన్నికల అధికారిగా కిరణ్ కుమార్, సహాయ ఎన్నికల అధికారిగా ఫణీంద్రబాబు వ్యవహరించిన ఈ ఎన్నికలలో తాలూకా అధ్యక్షులుగా ఎస్. వి.సుబ్బారెడ్డి, కార్యదర్శిగా కే శ్రీనివాసులు ఎన్నికయ్యారు.