AKP: ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం పంచాయతీ పరిధిలో 230 మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా అందలేదని మత్స్యకారు నాయకులు తెలిపారు. రేవు పోలవరం సముద్ర తీరం వద్ద సోమవారం మత్స్యకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అప్పన్న, వైసీపీ సోషల్ మీడియా నియోజకవర్గం కన్వీనర్ చేపల రాజు మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ రూ.20,000 జమ చేయాలన్నారు.