MBNR: జడ్చర్లలో ఏగుర్ ఆసుపత్రి ఎదురుగా రోడ్డు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు పండ్ల వ్యాపారులు రహదారిపైనే బండ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డు ఆక్రమణలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.