TG: రాష్ట్ర ఇంధన వినియోగం, ధరల లెక్కలను హరీష్ రావు వెల్లడించారు. HYDలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.115.62, డీజిల్ రూ.103.76గా ఉందన్నారు. రాష్ట్రంలో పెట్రోల్‌పై 35.20%, డీజిల్‌పై 27% వ్యాట్ ఉందన్నారు. నెలకు 27 కోట్ల లీటర్ల పెట్రోల్, 45 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోందని, ఈ అదనపు పెంపుతో సామాన్యుడు తీవ్రంగా నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.