CTR: బక్రీద్ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలు, సామాజిక సామరస్యాన్ని పరిరక్షించడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలని అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తుషార్ సోమవారం తెలిపారు. ఆవులు, దూడలు, ఇతర నిషేధిత పశువుల వధ, అక్రమ రవాణా వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. పలు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు.