SRD: ఇస్మాల్ ఖాన్ పేట సమీపంలోని నక్కవాగు బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జి రక్షణ గోడ కూలిపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి తక్షణమే బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.