VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను శ్రద్ధగా విన్నారు. మొత్తం 26 ఫిర్యాదులు అందగా, వాటిలో 13 భూతగాదాలు, 4 కుటుంబ కలహాలు, 9 ఇతర సమస్యలకు సంబంధించినవిగా ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదులపై చట్టపరంగా వేగంగా స్పందించి న్యాయం చేయాలన్నారు.