BDK: హైదరాబాద్లో జరిగిన సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు తమ సత్తాచాటారు. క్రీడాకారులు 4 బంగారు, 1 రజత, 2 కాంస్య పతకాలతో మొత్తం 7 పతకాలు సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జివి రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను పలువురు అభినందించారు.