SRD: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్యకు నిరసనగా, జిల్లా కోర్టు ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అశోక్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.