KMM: తల్లాడలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి, మట్టా దయానంద్లపై కొందరు చేస్తున్న విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గంలో దయానంద్దే తుది నిర్ణయమని, పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు వస్తాయని స్పష్టం చేస్తూ, విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.