TG: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. రూపాయి విలువ పడిపోతున్నా ప్రధాని మోదీ నిద్రలేవడం లేదని విమర్శించారు. బీజేపీపై కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డి మాట్లాడటం లేదన్న మంత్రి.. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని ఆరోపించారు.