MBNR: న్యాయవాదులకు వెంటనే రక్షణ కల్పించాలని పాలమూరు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటయ్య డిమాండ్ చేశారు. జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. లాయర్ ఖాజా మొహీనుద్దీను హత్య ఘటన దారుణమని పేర్కొని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.