కర్నూలు నగరాన్ని అందంగా, సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా లక్షల రూపాయల ప్రజాధనంతో సుందరీకరణ పనులను చేపట్టారు. దీనిపై పోస్టర్లు, బ్యానర్లు అతికించి పాడు చేసే వారిపై ఉదాసీన వైఖరి ప్రదర్శించవద్దని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. సోమవారం సదరు ప్రాంతాలను సందర్శించిన కమిషనర్, సంబంధిత వ్యక్తులకు కాల్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.