కృష్ణా: మచిలీపట్నంలో ఆపరేషన్ క్లీన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ బాలాజీతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం రోడ్లపై పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన ఆరోగ్యం కోసం మనమందరం కలిసి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. చెత్తను రోడ్లపై, ఖాళీ స్థలాల్లో వెయ్యకుండా చెత్త బండి వారికి అందజేయాలని సూచించారు.